![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -284 లో..... దీప ప్రొద్దున్నే లేచి తులసి పూజ చేస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇద్దరు కలిసి దీపం పెడతారు. ఏంటి ఏదో కోరుకున్నట్లున్నారని దీపని కార్తీక్ అడుగుతాడు. అవును మీరు మంచి స్థాయికి వెళ్ళాలని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కి దీప కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి ఎక్కడికో వెళ్లినట్లున్నారు.. ఏమైందని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉండాలంటూ కార్తీక్ నిరాశగా మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న రెస్టారెంట్ లో వర్క్ చేసే ప్రభాకార్ కార్తీక్ దగ్గరికి వస్తాడు.
ఏంటి ఇలా వచ్చారు ఏదైనా ప్రాబ్లమ్ ఆ అని కార్తీక్ అడుగుతాడు. అదేం లేదు సర్ జ్యోత్స్న రెస్టారెంట్ కి అప్పోజిట్ సత్యరాజ్ రెస్టారెంట్ ఉండేది కదా.. అది ఇప్పుడు దివాలా తీసింది అంట.. అమ్మకానికి రెడీగా ఉందట.. మీ వల్లే ఆ కంపెనీ దివాలా తీసింది. మీరు జ్యోత్స్న రెస్టారెంట్ కి ఒక మార్క్ క్రియేట్ చేశారు.. ఇప్పుడు మీరు ఆ రెస్టారెంట్ ని కొనండి. వాళ్లకి లాస్ లో నుండి ఎలా బయటకు రావాలో తెలియదు.. మీకు ఆ టాలెంట్ ఉంది.. అందుకే అంటున్నానని కార్తీక్ కి ప్రభాకర్ చెప్తాడు. నువ్వు ఆ జ్యోత్స్న రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఇలా చెప్పడం ఏంటని ప్రభాకార్ ని కార్తీక్ అడుగుతాడు. అక్కడ నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సర్.. వాళ్ళు జాబ్ కోల్పోకూడదు అందుకే అని ప్రభాకర్ అంటాడు.
అందుకు కార్తీక్ సరే అంటాడు. కార్తీక్ ఆ రెస్టారెంట్ గురించి మాట్లాడడానికి దీపని కూడా తీసుకొని వెళ్తాడు. మరొకవైపు సత్యరాజ్ రెస్టారెంట్ ని మనమే కొనాలి.. ఇక మార్కెట్ లో మనకి పోటీ ఉండరని జ్యోత్స్న శివన్నారాయణతో చెప్తుంది. ఆ కంపెనీ మనమే తీసుకొవాలని జ్యోత్స్నకి శివన్నారాయణ చెప్తాడు. దీప, కార్తీక్ లు సత్యరాజ్ ఆఫీస్ కీ వస్తారు. అక్కడ మేనేజర్ వాళ్ళను చూసి చులకనగా మాట్లాడతాడు. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. వాళ్ళని చూసి షాక్ అవుతుంది. కార్తీక్, దీపలు సత్యరాజ్ తో మాట్లాడటానికి వెయిట్ చేస్తారు. జ్యోత్స్న లోపలికి వెళ్లి డైరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది. ఓకే కానీ బయట ఇంకెవరో ఉన్నారు.. వాళ్లతో మాట్లాడి మీది ఫైనల్ చేస్తానని సత్యరాజ్ అంటాడు. దాంతో జ్యోత్స్న పొగరుగా వెళ్లి కూర్చుంటుంది. కార్తీక్, దీప లు లోపలికి వస్తారు. సత్యరాజ్ కార్తీక్ తో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |